ప్రణయ్ చివరి కోరిక ఇదే, అయన ఎప్పుడు ఒక మాట అంటూ…

ప్రణయ్ చివరి కోరిక ఇదే, ఈ విషయం చాలా సార్లు నాకు చెపుతూ ఉండేవాడు. ప్రణయ్ అమృత అనగానే అందరి కన్నులు ఒక్కసారిగా చేమ్మగిలుతాయి. ఎన్ని రోజులు అయిన ఆ దారుణాన్ని మర్చిపోవడం కష్టమే. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన పరువు హత్యల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ ఒకటి. కన్న కూతురు గురించి ఆలోచించకుండా అమ్మాయి తండ్రి కిరాతకానికి బలైన ప్రణయ్ కథ ఇది.

I Will Fight Till I Get Justice: Amrutha Pranay

ఒక్కసారిగా తెలుగు రాష్టాలు షాక్ లోకి వెళ్ళిపోయినా రోజు, తెలుగు వాళ్లు ఏ ఇద్దరు కలిసినా.. ప్రణయ్ పరువు హత్య గురించి మాట్లాడుకుంటున్నారిప్పుడు. వాళ్ల స్నేహం.. ప్రేమ.. గొడవలు.. పెళ్లి.. ఆ తర్వాత హత్య.. వాళ్ళ అందమైన జీవితంలో ఎన్నో మలుపులు. ఇలా వారి జీవితం ఊహించని మలుపులు తిరిగింది. అంతులేని విషాదం వారిని దూరం చేసింది. వాళ్ల జీవితం ఎక్కడ మొదలైంది.. ఎలా కొనసాగింది.. విధి వారితో ఎలా ఆడుకుంది ఓసారి చూద్దాం ఇక్కడ.

పెరుమాళ్ల ప్రణయ్.. తిరునగరి అమృత చిన్నప్పుడే క్లాస్ మేట్స్. చిన్నతనం నుండి పరిచయం. స్కూల్లో అమృత కంటే ప్రణయ్ ఏడాది పెద్ద. అమృత నైన్త్ క్లాస్… ప్రణయ్ టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ పరిచయం స్నేహంగా ఆ తర్వాత.. ప్రేమగా మారింది. చిన్న అప్పటి ప్రేమ, ఏదో తెలిసి తెలియక వయసు అనుకోలేము. పెళ్లి వరకు వచ్చారు. ప్రేమ అంటూ మోసాలు చేసే ఈ రోజుల్లో వాళ్ళు, నిజమైన ప్రేమ అంటే మాదే అని పెళ్లి వరకు వచ్చేసారు. చిన్నతనంలోనే ఇద్దరూ మాట్లాడుకుంటుండటం తెల్సుకున్న అమృత తరఫు పెద్దలు ప్రణయ్ కు, ప్రణయ్ కుటుంబానికి వార్నింగ్ ఇచ్చారు. తమ కూతురుతో మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. స్కూల్ మరిపొండి అని బెదిరించారు. ప్రణయ్ ను అతడి తండ్రి వారించాడు. ఇంటర్ లోనే చదువు మాన్పించారు. మళ్లీ బీటెక్ కోసం హైదరాబాద్ వెళ్లిన అమృత, ప్రణయ్ మళ్లీ మాట్లాడుకున్నారు. మాటలు పెరిగాయని తెల్సుకున్న పెద్దలు పోలీసులకు కంప్లయింట్ చేశారు. విషయం చాలా పెద్దది అయింది. ప్రణయ్ సెల్ ఫోన్, సిమ్ కార్డులు అన్నీ పోలీసులకు ఇచ్చేసిన తండ్రి బాలస్వామి, ఈ ఒక్కసారి వదిలేయండి, తప్పు అయింది తెలిసి తెలియని వయసు, అమ్మాయి జోలికి తమ కొడుకు రాడని హామీ ఇచ్చాడు.

తల్లిదండ్రులకు తెలియకుండా. బెదిరింపులకు లొంగకుండా ఎప్పటికప్పుడు అమృత, ప్రణయ్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. హైదరాబాద్ లో కొద్దిరోజులు అమృత ఉద్యోగం చేసింది. ఇద్దరు హైదరబాద్ లో కలుస్తున్నారు అని తెలిసిన అమృత తండ్రి మారుతీ రావు ప్రేమ వ్యవహారాన్ని కట్ చేయాలని అమృతపై తండ్రి మారుతీరావు ఒత్తిడి తెచ్చేవాడు. అమృత బాబాయ్ శ్రవణ్ ఐతే తనను తీవ్రంగా హింసించేవాడని. అస్సలు వినేవాడు కాదు అని, దారుణంగా తన్నేవాడని.. డంబుల్స్ తో దాడిచేసేవాడని అమృతే హాస్పిటల్ లో వివరించింది. కుటుంబీకుల టార్చర్ భరించలేని అమృత, ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు ప్రణయ్ కి దూరంగా ఉండలేక, ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసోకోవడానికి సిద్ధపడింది. రెండు కుటుంబాల వాళ్లు తమ పెళ్లికి వ్యతిరేకంగా ఉండటంతో ఎవరికీ చెప్పకుండా ప్రణయ్, అమృత హైదరాబాద్ ఆర్యసమాజ్ లో జనవరి 30న పెళ్లిచేసుకున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో ఉండసాగారు. అయితే అక్కడ కోపం మాత్రం ఇంకా తగ్గలేదు. పెళ్లి తర్వాత వారికోసం అమృత తండ్రి మారుతీరావు వెదుకులాడాడు. ప్రణయ్ తోనే ఉంటానని.. ఎప్పటికప్పుడు తన తల్లికి చెబుతూ ఉండేది అమృత. పెళ్లి చేసుకున్నా ఫర్వాలేదు.. ఇంటికి వచ్చెయ్ అని తండ్రి మారుతీరావు హెచ్చరించేవాడు. వాడు మన కులం కాదు, మనకు సరితుగాడు అని గట్టిగ చెప్పేవాడు.

ఇంకా ఇలాగె ఉంటె, దారుణంగా మారుతుంది అని ముందే గ్రహించిన అమృత పేరెంట్స్ బెదిరింపులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రణయ్ తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడంతో.. వారికి మాతో ఎటువంటి ప్రమాదం ఉండదని నమ్మకంగా పోలీసులకు చెప్పాడు మారుతీరావు. అయితే ఆ మాటలు ఎంత వరకు నిజమో తెలియదని అమ్మాయిని తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని బాలస్వామి చెప్పినా అమృతమాత్రం భర్త దగ్గరే ఉంటానని పోలీసులకు చెప్పింది. ఐతే… తమ కూతురు కదలికలపై మనుషులను పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం తెల్సుకునేవాడు మారుతీరావు. ప్రణయ్ ను చంపాలనుకునే ఉద్దేశంతో సమయం కోసం ఎదురుచూశాడు. తండ్రి దగ్గరకే వెళ్లాలని ప్రణయ్ తల్లిదండ్రులు చెప్పినా… తాను చనిపోతాను కానీ.. పేరెంట్స్ ఇంటికి వెళ్లనని అమృత చెప్పేది. ఇంతలోనే అమృత గర్భవతి కావడంతో.. ప్రణయ్ పేరెంట్స్ మరింత జాగ్రత్తగా చూసుకున్నారు. వారిద్దరికీ డేంజర్ పొంచి ఉండటంతో.. మిర్యాలగూడలోనే తన ఇంటికి సీసీ కెమెరాలు పెట్టించి ఇంట్లోనే ఉంచాడు.

పెళ్లి విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో రిసెప్షన్ జరపాలన్న కోడలు, కొడుకు ఫోర్స్ చేశారు. కాదనలేని పరిస్థితిలో.. రిసెప్షన్ ను ఆగస్ట్ 17న మిర్యాలగూడలోనే గ్రాండ్ గా జరిపాడు తండ్రి బాలస్వామి. ఓ ప్లాట్ అమ్మి వచ్చిన డబ్బుతో ఫంక్షన్ జరిపాడు. రిసెప్షన్ కార్డు ఇచ్చి.. డీఎస్పీ, ఎమ్మెల్యేలను కూడా పిలిచాడు. ఆ తర్వాత వారిని స్వాగతించినట్టు నమ్మించాడు మారుతీరావు. అమృత ఐదు నెలల గర్భిణీ అయనా కూడా.. ఆమె భర్తను కిరాతకంగా చంపించాడు మారుతీరావు.

ఇద్దరినీ ఎందరు విడదీయాలని చూసినా.. వాళ్లు వెరవలేదు. బెదరలేదు. మనసులు కలవడంతో.. పెళ్లితో ఒక్కటయ్యారు. కానీ.. అమృత తొమ్మిదో తరగతిలోనే పుట్టిన కోపం… వారి ప్రేమతోపాటే పెరిగి పెద్దదై చివరకు ఆమె భర్తను చంపేంతవరకు తీసుకెళ్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *